Monday, April 7, 2014

జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌ ...


రేమద్దులలో జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.

Tuesday, April 1, 2014

ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం

ఎంపిటిసి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది (2014).  టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ బలపర్చిన సిపిఎం పార్టీ, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు, నాయకులు  గ్రామంలో  ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

మా ఊరు ఎంపిటిసి అభ్యర్థులు ( రేమద్దుల ) :
TRS -YadagiriReddy
BJP - SurendarReddy
CPI(M)+Cong - Venugopal
Indp - O.Balaswamy

Thursday, March 13, 2014

మా ఊరి స్కూల్ జ్ఙాపకాలు...



 దాదాపు 30 ఏళ్ళ నాటి మాన  స్కూల్ విద్యార్థుల  నేటి  ఫొటో ఇది.    05.05.2013 న రేమద్దుల లో జరిగిన ఈ అరుదైన ఫొటోలోని  నాటి  స్మృతులను గుర్తు చేసినాయి.  నాటి  మిత్రులను వారి  జ్ఙాపకాలు చూడగలిగాము. 
మా ఊరి స్కూల్ జ్ఙాపకాలు 1985-86 :  Shamala Sridevi, Vijayalaxmi, Sridevi, Bhavani, Suvarna, Prasanna, Sathya shiva, G.Ramulu, Raghuramulu, Thirupathi Reddy, Rajashekar reddy, Abubhakar, Krishnaiah

Saturday, March 1, 2014

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు...


శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాన్‌గల్‌ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు అట్టహసంగా సాగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 10 జతాల ఎద్దులు పాల్గొనగా మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన జంగిడి వరుణ్‌తేజ ఎద్దులు 3,332 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయిచూరుకు చెందిన అంజనేయ ఎద్దులు 3,142 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచారు. మొదటి బహుమతి రూ.40వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేల నగదును అందజేశారు.








Sunday, February 23, 2014

అభివృద్ధి పనులకు శ్రీకారం...

        పాన్‌గల్‌ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో గ్రామ సర్పంచు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు అందరూ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గురువారం 20.02.14  శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని 8, 12వ వార్డుల్లో లక్ష రూపాయల నిధులతో మిని వాటార్‌ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో ఏ అభివృధ్ధి పని జరుగాలన గ్రామ ప్రజల సహాయ సహకారం అవసరమని ఆమె కోరారు. 
        ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు నర్సింహ్మా, వార్డు మెంబర్లు, సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి వేణుగోపాల్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, నాయకులు కృష్ణయ్య, లింగయ్య, కిష్టయ్య పాల్గొన్నారు.


Thursday, February 13, 2014

Sunday, January 19, 2014

యువత పోరాడాలని...

 రేమద్దుల గ్రామంలో నిర్వహించిన క్రీడోత్సవాల ముగింపు సభ :
విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పన కోసం యువత పోరాడాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి అన్నారు. గురువారం రాత్రి పానగల్‌ మండలంలోని రేమద్దుల గ్రామంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాల ముగింపు సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. జిల్లా, డివిజన్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నల్గొండ కళాకారుల ఆటపాటలు అలరించాయి. 


Thursday, January 16, 2014

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి...


       గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ, యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి జబ్బార్‌ సూచించారు.రేమద్దుల గ్రామంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఉపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతీ, యువకులను పాశ్చత్యా సంస్కృతి వైపు వెళ్లకుండ వారిని చైతన్యం చేయాలన్నారు. అందుకు అందరిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి 30ఏళ్లుగా డివైఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా క్రీడోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతీ,యువకుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మండల కేంద్రాల్లో మిని స్టేడియాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
           ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామకార్యదర్శి వేణుగోపాల్‌, డివైఎఫ్‌ఐ గ్రామ అద్యక్ష కార్యదర్శులు భాస్కర్‌, ఆంజనేయులు, నాయకులు జి.వెంకటయ్య, కృష్ణయ్య, భగత్‌, రాములు, ఫయాజ్‌, కైలాప్‌, తిరుపతి రాములు పలువురు పాల్గొన్నారు.