Showing posts with label మా ఊరి పండుగలు. Show all posts
Showing posts with label మా ఊరి పండుగలు. Show all posts
Wednesday, September 2, 2015
Saturday, March 1, 2014
అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు...
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాన్‌గల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు అట్టహసంగా సాగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 10 జతాల ఎద్దులు పాల్గొనగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన జంగిడి వరుణ్‌తేజ ఎద్దులు 3,332 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయిచూరుకు చెందిన అంజనేయ ఎద్దులు 3,142 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచారు. మొదటి బహుమతి రూ.40వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేల నగదును అందజేశారు.
Monday, October 14, 2013
ఘనంగా దసరా...
దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం. ముక్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. అన్ని ప్రాంతాలలో ఉన్న బంధువులు, స్నేహితులు ఊరికి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుంటారు. తీయనీ తీపీ వంటలు ( బక్షాలు ... ) చేసుకుంటారు.
దసరా రోజు సాయంకాలం శమీ (జమ్మి) వృక్షాన్ని పూజిస్తారు. ఏదుట్ల వైపు ఊరి బయట జమ్మి వృక్షాన్ని వుంచి బజనలతో అందరు వెళ్ళి ఆ వృక్షాన్ని పూజిస్తారు. జమ్మి ఆకులను ‘సువర్ణంగా’ భావించి దసరా పండుగ నాడు పిల్లలు, పెద్దలు, బంధువులు, స్నేహితులు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.
పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకోవడం సంప్రదాయం.
మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...
మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...
Wednesday, September 4, 2013
మా ఊరిలో ఘనంగా" బోనాల పండగ "
మంగళవారం 27.08.2013 న బోనాల పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇళ్ళ నుండి మహిళలు, అమ్మాయిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు చేశరు. నైవేద్యన్ని సమర్పించి భక్తులు మోక్కులు తీర్చుకున్నరు. గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.
Subscribe to:
Posts (Atom)










