Monday, October 14, 2013

ఘనంగా దసరా...

        దసరా పండుగను ఘనంగా  జరుపుకుంటాం. ముక్యమైన  పండుగలలో  దసరా పండుగ ఒకటి.  అన్ని ప్రాంతాలలో ఉన్న  బంధువులు, స్నేహితులు ఊరికి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుంటారు. తీయనీ తీపీ వంటలు ( బక్షాలు ... ) చేసుకుంటారు.  
         దసరా రోజు సాయంకాలం   శమీ (జమ్మి) వృక్షాన్ని పూజిస్తారు. ఏదుట్ల వైపు ఊరి బయట జమ్మి వృక్షాన్ని వుంచి బజనలతో అందరు  వెళ్ళి  ఆ  వృక్షాన్ని పూజిస్తారు.  జమ్మి ఆకులను ‘సువర్ణంగా’ భావించి దసరా పండుగ నాడు  పిల్లలు, పెద్దలు, బంధువులు, స్నేహితులు ‘బంగారం’ అంటూ ఒకరికి ఒకరు ఇచ్చుకుంటారు.     

     పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకోవడం సంప్రదాయం. 
      మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు,  మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...
  

సమస్యలు పరిష్కరించాలి...